Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుడి కల్యాణం -పెద్ద ఎత్తున హాజరైన భక్తులు

విశాలాంధ్ర ..ఉరవకొండ..స్థానిక మల్లేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి కళ్యాణోత్సవం కమణీయంగా జరిగింది. ఈ కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై తిలకించారు. స్వామివారి కల్యాణం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శ్రీమల్లేశ్వర స్వామివారి మూల విరాట్ ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.అనంతరం అభిజిత్ లగ్నమందు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి కల్యాణాన్ని కమణీయంగా నిర్వహించారు.స్వామివారి వైపునుంచి నాగరాజు దంపతులు, అమ్మవారి తరుపున రంగస్వామి దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img