Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

అకతాయిలపై నిఘా వేసి ఈవ్ టీజింగ్ నియంత్రణకు చర్యలు తీసుకోండి

అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అకతాయిలపై నిఘా వేసి ఈవ్ టీజింగ్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఆర్ ఎన్ అమ్మిరెడ్డి ఆదేశించారు. బుధవారం అనంతపురం నగంలో నా భూమి- నా దేశం హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్ ర్యాలీ స్థానిక తెలుగు తల్లి కూడలి వద్ద ముగిసింది. ఈసందర్భంగా డి.ఐ.జి దిశ పెట్రోలింగ్ బృందాలతో మాట్లాడారు. మహిళలు, అమ్మాయిలకు రక్షణగా దిశా పెట్రోలింగ్ బృందాల పని తీరు ఉండాలన్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా వేసి అకతాయిల భరతం పట్టాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు వదిలే సమయంలో రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ జరుగకుండా ఆయా ప్రదేశాలలో సంచరిస్తూ నియంత్రించాలన్నారు. ఆయా ప్రాంతాలలో విజిబుల్ గా ఉండటం వల్ల ఈవ్ టీజింగ్ , తదితరాలు జరుగకుండా ప్రివెంట్ చేసినట్లవుతుందన్నారు. దిశ యాప్, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న కూడళ్లలో స్కూలు పిల్లలు ఇబ్బంది పడకుండా సురక్షితంగా దాటించాలన్నారు. డి.ఐ.జి తో పాటు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు, అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఎ.హనుమంతు (ఏ.ఆర్ ), దిశ డీఎస్పీ ఎం.ఆంథోనప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img