Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

దేశ రాష్ట్ర రాజకీయాల పైన సైద్దాంతిక సిద్ధాంతాలు విజ్ఞానం అవసరం..

డిజిటల్ కాలంలో నాయకులకు అప్డేట్ అవసరం…

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్

విశాలాంధ్ర-గుంతకల్లు : సిపిఐ పార్టీ శ్రేణులకు రాజకీయ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగమని ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాల పైన సైద్దాంతిక సిద్ధాంతాలు విజ్ఞానం పైన రెండు రోజులు అవగాహన అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ అన్నారు. మంగళవారం కసాపురం గ్రామంలో వాసవి కళ్యాణ మండపంలో సైద్దాంతిక రాజకీయ శిక్షణ తరగతులు సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షతన వహించారు.ఈ శిక్షణ తరగతులలో ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్రస్వామి,సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి,ఉపాద్యాయులు నరసింహులు,కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాలోని 32 మండలాల నుండి పెద్ద సంఖ్యలో శిక్షణ తరగతులకు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.ముందుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు చేతుల మీదగా సిపిఐ పార్టీ జెండా ను ఆవిష్కరించారు.అనంతరం సభ ప్రారంభంలో ముందుగా సిపిఐ సీనియర్ నాయకులు చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి డి.జగదీష్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం శిక్షణ తరగతులను ప్రారంభించారు.ఈ సందర్బంగా డి.జగదీష్ మాట్లాడుతూ…కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అని స్వతంత్రంలో కీలక పాత్ర పోషించిన పార్టీ అన్నారు.అనేక రాజకీయ పార్టీలకు సిపిఐ పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ కాబట్టి బయమన్నారు.భారతదేశంలో కమ్యూనిస్టు అదికారంలో లేకపోయిన క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు.కమ్యూనిస్టు పార్టి ఎప్పుడు సిద్ధాంతాలతో ముందుకు పోతుందన్నారు.సిపిఐ పార్టీ చరిత్రలో వడదుడుకులు ఎదుర్కొని కమ్యూనిస్టు పార్టీ బలపడిందన్నారు.మన దేశంలో రాజకీయ మార్పులు, అనేక రంగాల్లో మార్పులు వచ్చాయని అందుకు అత్యంత ప్రాముఖ్యతమైన శిక్షణ తరగతులు విజ్ఞానాన్ని పెంచుకోవడమే లక్ష్యం అన్నారు.దేశంలో డిజిటల్ కాలంగా మారిందని అందుకు అనుగుణంగా కమ్యూనిస్టు నాయకులు అప్డేట్ కావాలన్నారు.మతోన్మాద బిజెపి కుట్రల వల్ల బిజెపి మత రాజకీయాలు చేస్తుందని హిందువులను ఏ మారుస్తున్నారని అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా మత రాజకీయాలను తరిమికొట్టేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తుందన్నారు.భూమి కోసం ,భుక్తి కోసం, పేదలు, శ్రామికులు,కార్మికుల కోసం పోరాటాల వల్ల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం వల్లే ఇవన్నీ దక్కయని రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు క్రమ శిక్షణగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ శిక్షణ తరగతుల్లో 32 మండలాల సిపిఐ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img