Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

భూసేకరణ వేగవంతం చేయాలి

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం ; జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారులు, ఏపీఐఐసి, హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారి 544డి (అనంతపురం – బుగ్గ- అమరావతి హైవే), ఎన్హెచ్ 67, జిడిపల్లి, ఉలికల్లు, లక్ష్ముపల్లి ఆర్డఆర్ ప్యాకేజి, హెచ్ఎన్ఎస్ఎస్, ఏపీఐఐసి పరిధిలో పలు ప్రాజెక్టులకు భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలన్నారు. ఎలాంటి ఆలస్యం కాకుండా పెండింగ్ ఉన్న వివిధ ప్రాజెక్టులకు సకాలంలో భూసేకరణ చేపట్టాలని, ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో భూసేకరణ జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు మధుసూదన్, నిశాంత్ రెడ్డి, రవీంద్ర, ఏపిఐఐసి జడ్ఎం వరప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, అహుడా సెక్రెటరీ చిన్నయ్య, ఎన్ హెచ్ అధికారి రమేష్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img