విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ కు వైయస్సార్సీపి జిల్లా అధ్యక్ష పదవి రెండవసారి ఇచ్చినందుకు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయం నందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఆయనకు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు సాధించాలని అత్యున్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శర్మ, నాగిరెడ్డి, శ్రీనివాసులు, జావిద్ , బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.