Monday, September 25, 2023
Monday, September 25, 2023

వేదమంత్రాల నడుమ దేవాలయ శంకుస్థాపన..

ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు ఎస్. జయశ్రీ
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో 600 సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క దేవాలయ శంకుస్థాపన, పూజా కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషములకు ఈ శంకుస్థాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. తదుపరి మహా మంగళహారతి, స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ను అర్చకులు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సతీమణి సుప్రియ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జయశ్రీ, గడ్డం పార్థసారథి, పుట్లూరు నరసింహులు, కలవల మురళీధర్ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణమ్మకు దాతల సహాయ సహకారాలు ఎంతో అవసరం గా ఉందని, ఆసక్తిగల భక్తాదులు దాతలు ఆలయ నిర్మాణానికి నగదు రూపేనా సహాయ సహకారాలు అందించాలని వారు తెలిపారు. ఆలయ నిర్మాణంలో భాగంగా కళ్యాణ మండపము, భక్తుల తల నీలాల కొరకు కళ్యాణకట్ట, శ్రీ గరుత్మంతుని విగ్రహం ఏర్పాటు, తదితర నిర్మాణాలను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. 25వేల రూపాయలు ఆ పైన చెందా ఇచ్చిన దాతల పేర్లను శాశ్వతంగా శిలాఫలకంపై వ్రాయించబడునని తెలిపారు. భక్తులు ధన, వస్తు రూపేనా విరాళములు అందించాలని వారు కోరారు. విరాళాలు ఇవ్వదలచిన వారు కెనరా బ్యాంక్.. అకౌంట్ నెంబర్.. 110074984103 (ఐఎఫ్ఎస్సి కోడ్. సిఎన్ఆర్బి 0000851) నేరుగా కూడా వేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయ ప్రకాష్, కృష్ణ, నరేంద్ర, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img