Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన బేడా బుడగ జంగం నాయకులు

విశాలాంధ్ర-ఉరవకొండ : బెడ బుడగ జంగం వర్గాన్ని మళ్లీ షెడ్యూల్ జాబితాలో చేర్చి వారికి న్యాయం చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల ఉరవకొండ లోని బేడ బుడగ జంగం కులస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం స్థానిక వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బేడ బుడగ జంగం సంఘం నాయకులు మహేంద్ర విలేకరులతో మాట్లాడుతూ బెడ బుడగ జంగం సామాజిక వర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో పిల్లల చదువులు, సంక్షేమం, ఉపాధి లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను తమ సామాజిక వర్గం కోల్పోయింది అన్నారు. అయితే తమ న్యాయమైన సమస్యను గుర్తించి సానుకూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవ మరువలేనిది అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాము చేస్తున్న పోరాటానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. తమ న్యాయమైన సమస్యను ప్రభుత్వము మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి కృషి కూడా మరువలేనిది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం సంఘం నాయకులు నాగయ్య మారెన్న, బాబయ్య,సుధాకర,గోపి, అంజి, కుల్లాయప్ప,మల్లికార్జున, విజయ్, మారక్క తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img