Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్ అయిన ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు

విశాలాంధ్ర- ధర్మవరం : ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదా మాదిగ సత్తా చూపుతామని ఎమ్మార్పీఎస్ సంఘం నాయకులు సిరెడ్డి బూధప్ప, గజ్జల రామాంజనేయులు, ఎన్. నారాయణ, గజ్జల శివప్రసాద్ లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద గురువారం నిరసన జ్వాలలతో ఁఖబర్దార్ పెద్దిరెడ్డిఁ అని హెచ్చరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రికి మందకృష్ణ మాదిగ పేరును కూడా ఉచ్చరించడానికి అర్హత లేని మీరు మందకృష్ణ మాదిగ గురించి చేసిన వాక్యాలు యావత్ దళిత జాతి హెచ్చరిస్తుందని తెలిపారు. దళిత జాతి వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని వారు సవాల్ విసిరారు. మందకృష్ణ మాదిగ కేవలం ప్రజాసేవకే అంకితమైనారని, గత 29 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ, దేశంలో ఏ జాతి నాయకుడు చేయలేనని ఉద్యమాలు చేసి, వికలాంగుల హక్కుల కోసం పోరాటాలు చేసి, ఆరోగ్యశ్రీ వచ్చేలాగా చేసిన నాయకుడు మా మందకృష్ణ మాదిగ అని తెలిపారు. అలాంటి వారి గురించి మంత్రి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, సరైన సమయంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి చెబుతూ నవ్వుల పాలు కావద్దని, కుల అహంకారంతో మంత్రి మాట్లాడిన మీ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరప్రసాద్, పవన్ కుమార్, నితీష్, పూజారి పెద్దన్న, సాకే రవి, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img