Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

7న చలో విజయవాడ రైతు ధర్నాపై కరపత్రం విడుదల

విశాలాంధ్ర-ఆత్మకూరు : అంద్రప్రదేశ్ రైతుసంఘము పిలుపు మేరకు మంగళవారం ఆత్మకూరు మండలకేంద్రములోని కింద బస్టాండ్ దగ్గర ఛలో విజయవాడ కరపత్రాలు విడుదల చేశారు.
ఈ సంధర్బంగా ఏపి కౌలురైతుసంఘము రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సనప నీలపాల రామకృష్ణ సిపిఐ ఆత్మకూరు మండల సహాయ కార్యదర్శి బండారు శివ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలుగా రాష్ట వ్యవసాయ రంగాన్ని నిట్ట నిలువునా తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి మరీముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఎందుకంటే జిల్లాలో పంటల బీమా పంట నష్టపరిహారం ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రభుత్వ విధానాల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి రైతుకు 2. 45 వేల రూపాయలు ఋణభారంతో ఉన్నారు దేశంలో ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది వీరిలో అత్యధికలు పేదరైతులు కౌలురైతులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలు ఆశాస్రీయంగా ఉన్నాయి కనీసం మద్దతు ధరలు కూడా రైతులకు తమ ఉత్పత్తుల అమ్ముకోలేకపోతున్నారు,డాఁస్వామినాథన్ కమీషన్ సిఫారసులను ప్రభుత్వాలు అటకెక్కించాయి,అందుకే ధరల స్థిరీకరణ 3,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, జాతీయ విపత్తుల కింద సంవత్సరానికి ₹4,000 కోట్ల రూపాయతో బడ్జెట్లో నిధులు కేటాయించాలని అగస్టు 7వతారీఖున అమరావతి రాజదానికేంద్రములోఈక్రింది డిమాండ్లపై మహధర్నా జరుగుతున్నది కావునజిల్లా వ్యాప్తంగా రైతులు కౌలు రైతులు తరలి రావాలని
పిలుపునివ్వడమైనది.
డిమాండ్లు
1) పంటపెట్టిన ప్రతి రైతుకు,పంటభీమా,పంటనష్టపరిహరము అందించాలి.
2)తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు పదివేల రూపాయలు సాగు సాయం పెట్టుబడి కింద అందించాలి .
3)రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న ప్రతి రైతుకు 20వేల రూపాయల వరకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాలి, రెండు ఎకరాల పైబడిన వారందరికీ ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున సాయం అందించాలి.
4) డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మేరకు(సి2ం50) అమలు చేయాలి.
5) రైతులు కౌలు రైతులు అన్ని రకాల పంట రుణాలను రూపాయల వరకు మాఫీ చేయాలి, కేరళ తరహా రుణ ఉపశమన చట్టం తేవాలి. 6)పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తి ఖర్చును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విత్తనాలు ఎరువులు డపురుగుమందులు ఉపకరణాలు 90% సబ్సిడీతో అందించాలి.
7) 50 సంవత్సరాలు పైబడిన రైతు, కౌలు రైతులకు ప్రతినెల 10 వేల రూపాయలు పెన్షన్ అందించాలి.
8) విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని ఆలోచన ఉపసంహరించుకొని ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. 9)వ్యవసాయ పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలి .
10)భూ యజమాని ప్రమేయం లేకుండా కౌలు రైతులకుగుర్తింపు కార్డులు జారీ చేయాలి,రైతులకు వర్తింపచేసేపథకాలన్ని అమలుచేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
రైతు తలారి ఖాసీం, గోపాల్ నాయక్, లక్ష్మీదేవి, వినోద్, మల్లన్న రైతులు తదితరులుపాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img