Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పవర్ లూమ్స్ భారీ నుండి చేనేత పరిశ్రమను కాపాడుకుందాం

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి
విశాలాంధ్ర – ధర్మవరం : పవర్ లూమ్స్ భారీ నుండి చేనేత పరిశ్రమను కాపాడుకుందామని, ఇందుకు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మార్కెట్ వీధిలోని జి ఆర్ బి ఫంక్షన్ హాల్ (దుర్గమ్మ గుడి వద్ద) లో నేతన్నల సమావేశమును జయప్రదం చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆటో ప్రచార జాత కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జింకా చలపతి మాట్లాడుతూ భవిష్యత్తులో చేనేతను రక్షించుకోవాలంటే ఈ సమావేశానికి చేనేత కార్మికులు తండోపతండాలుగా రావాలని వారు పిలుపునివ్వడం జరిగిందన్నారు.”ప్రొటెక్ట్ హ్యాండ్లూమ్-సేవ్ హ్యాండ్లూమ్ వీవర్స్ అన్న పేరుతో ఫ్లెక్సీని తయారుచేసి, శని ,ఆది వారాలలో పట్టణమంతా ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. చేనేత పరిశ్రమను రక్షించుకుంటేనే, చేనేత కార్మికుడు జీవితములో బ్రతుకగలిగే అవకాశం ఉందని వారు తెలిపారు. చేద్దామంటే పని లేదు, చేసిన పనికి కూలి లేదు, నేద్దామంటే మగ్గం లేదు, నేసిన చీరకు గిట్టుబాటు ధర లేదు, మాకు దారేంటి.? మా భవిష్యత్తు ఏంటి? మా ఉపాధి మాటేంటి ?అన్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించడం జరుగుతుందని వారు తెలిపారు. చేనేత రిజర్వేషన్ చట్టం అమలు చేసి, చేనేత కార్మికుల ఉపాధిని పరిరక్షించాల్సిన అధికారులు, పాలకులు కూడా చేనేతను చెరపెట్టిన పవర్లూమ్స్ యాజమాన్యంతో చట్టపట్టలేసుకొని తిరుగుతుండడం ,దారుణం కాదా? అని వారు ప్రశ్నించారు. నేడు కుల మతాలకు అతీతంగా, వేలాదిమందికి జీవన ధారమైన చేనేత పరిశ్రమలు చంపవద్దని, అది ఉపాధి సంక్షోభానికి దారి తీస్తుందని, నెత్తి ,నోరు, బాధి మొత్తుకున్న వినకుండా, చేనేత కార్మికులను కష్టాల సుడిగుండములోకి నెత్తిన వైనాన్ని అధిగమించాలి అంటే– చేనేత కార్మికులందరూ కూడా ఐక్యం కావలసిన సమయం ఆసన్నమైనదని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశం చేనేత కార్మికుల భవిష్యత్తుకు, భద్రతతో పాటు జీవన ఉపాధిని కూడా కల్పించడం జరుగుతుందని, కావున చేనేత కార్మికులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ, అధ్యక్షులు వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, పాలగిరి శ్రీధర్, మంజునాథ్, వరప్రసాద్, సురేష్, రామాంజనేయులు, నాగరాజు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img