Monday, March 20, 2023
Monday, March 20, 2023

తెదేపా బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం

విశాలాంధ్ర – పెనుకొండ : తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెనుకొండ నందు సోమవారం టి ఎన్ టి యు సి జిల్లా కార్యవర్గ సమావేశం పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టి ఎన్ టి యు సి నాయకులు గ్రామస్థాయి నాయకులు ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడాలనికోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సందర్భంలో ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా మనం కలిసికట్టుగా పోరాడి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని తెలియజేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని పిలుపునిచ్చారు. టి ఎన్ టి యు సి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నాగభూషణ, జిల్లా అధ్యక్షులు తాళాల నాగభూషణం, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img