వయనాడ్ బాధితుల సహాయార్థం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిధి వసూలు
విశాలాంధ్ర – అనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ బాధితుల కోసం బుధవారం ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో మునిసిపల్ కార్యాలయం నందు సహాయ నిధి వసూలు చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… వయనాడ్ జిల్లా ప్రకృతి వైపరిత్యానికి గురై వందలాది మంది మరణించడం జరిగిందన్నారు. వరదల్లో కొండ చెరియలు విరిగిపడి ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయన్నారు. పూర్తిగా ఇళ్ళు ద్వంశం అయిపోయి తినడానికి తిండి లేక వేలాది మంది నిరాశ్రయులు అయ్యారన్నారు. ఇలాంటి జాతీయ విపత్తుకు ప్రతి ఓక్క భారతీయుడు సహాయ పడాలన్నారు. ఏఐటీయూసీ ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ మన రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిధి వసూలు చేస్తున్నామన్నారు, ఈ నిధి వసూలు కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు, ఏ పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,నాయకులు వేణుగోపాల్, తిరుమలయ్య, ప్రసాద్,ఎర్రప్ప, రామాంజి, నాగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.