Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యల నుండి కాపాడుదాం

ఈ నెల 7న జరిగే ర్యాలీను విజయవంతం చేయండి..
చేనేత కార్మికులకు పిలుపు..
అంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం,సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి మధు..

విశాలాంధ్ర – ధర్మవరం : చేనేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యల నుండి కాపాడుకునేందుకే ఈ నెల ఏడవ తేదీన జరిగే ర్యాలీలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో కేశవ నగర్ నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకట్ నారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి సహాయ కార్యదర్శి రవి, వై. రమణ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పట్టణంలో కొన్ని నెలలుగా చేనేత కార్మికుల పరిస్థితి దుర్భిక్షం ఉందని, చేనేత పరిశ్రమ భారీ సంక్షోభంలో కూరుకుపోయిందనీ ,వీటన్నిటికీ కారణం పవర్ లూమ్స్ లో చేనేత రకాల నేయడం వల్ల ఈ సంక్షోభం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు అధికారులే చేనేత కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని, సాక్షాత్తు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ, చేనేత జోలి శాఖ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కార్మికుల సమక్షంలో వాటిని పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా అధికారులు పర్యవేక్షణ కరువైందని, దాంతో చేద్దామంటే పని లేదు.. చేసిన పనికి కూలి లేదు..  నేద్దామంటే మగ్గమే లేదు.. నేసిన చీరకు గిట్టుబాటు ధరేలేదు.. అన్నట్లు చేనేత కార్మికుల పరిస్తితి తయారైందని ప్రభుత్వ అధికారులపై మండిపడ్డారు. మాకు దారేంటి? మాభౌష్యత్తేంటి? అని చేనేత కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధి నిర్వాకమే నేటి.. ఈ సంక్షొభానికి కారణమని మండిపడ్డారు. ఇక్కడ  పెద్ద ఎత్తున  మరమగ్గాలు ఏర్పాటు జరుగుతున్నాయని, సంపన్నులు  తక్కువ వేతనాలకు  కలకత్తా  నుండి నెతగా ల్లను తెచ్చి నేయించు కోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. 25 శాతము మించి బైటవారిని నియమించుకొకూడదన్న నిభందనలను కూడా తుంగలో తొక్కుతున్నా రనీ, అధికార్లు నిమ్మకు నీరెత్తినట్లున్నారని వారు విమర్శించారు.   ఒకనాడు ఇక్కడి చేనేత కార్మికున్ని మగ్గంలోకి దించుకొవడానికి పోటీలు పడ్డ..మాస్టర్ వీవర్స్ ఇప్పుడు మొఖం చాటేస్తుండడంతో,, తరతరాలుగా ఈ చేనేత పరిశ్రమను నమ్ముకొన్న ఏనేత కార్మికులు నేయడానికి మగ్గం లేక పొవడంతో, విధిలేక అరకొర వేతనాలకే పని చేయడానికి సిద్దమౌతున్న రణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో దీనంతటికీ కారణమైన వారిని నిలదీయవలసిన సమయం ఆసన్నమైందని చేనేత కార్మికులు ఈ స0క్షోభం నుండి బైట పడడానికి ఆఖరి పొరాటానికి సిద్దం కావలసి ఉందని వారు పిలుపునిచ్చారు. ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, శ్రీనివాసులు, లోకేష్, వెంకట్ నారాయణ, శేఖర, మంజు, గోవర్ధన్, చింత శ్రీనివాసులు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img