ఏపీ చేతి వృత్తిదారుల సంఘం
విశాలాంధ్ర – బుక్కరాయసముద్ర : రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిపిఐ బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4 న సాయంత్రం అనంతపురం లో బహిరంగ సభ కి హాజరై విజయవంతం చేయాలని ఏపీ చేతి వృత్తిదారుల సమాఖ్య అధ్యక్షుడు సి లింగమయ్య పేర్కొన్నారు. అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో చేతి వృత్తిదారుల సమాఖ్య సమావేశం వెనకచర్ల బాలయ్య అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా సి .లింగమయ్య మాట్లాడుతూ .. ప్రజా చేత్రంలో సీఎం జగన్ చేస్తున్న అన్యాయాలను సిపిఐ బస్సు యాత్ర ప్రజలను మేల్కొల్పుతూ.. ఎండ కొడుతుందని అన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవే టీకరణను ఆపాలని, పోలవరం ప్రాజెక్టు, అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని వెనకబడిన వర్గాలకు చేయూతనిచ్చి వారి యొక్క అభివృద్ధి కితోడ్పడాలని సిపిఐ బస్సు యాత్ర తలపెట్టినది అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన నాయకులు బంగారు భాష, సివి హరి కృష్ణ, నాగప్ప వెంకటనారాయణ, ప్రసాదు జయలక్ష్మి, సి ఆదినారాయణ ,రాజు హనుమంతు ,గోవిందరాజులు ఆదినారాయణ, సంజీవులు పాల్గొన్నారు.