సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: దేశాన్ని రక్షించండి – కాపాడండి సిపిఐ పార్టీ చేపడుతున్న బస్సు యాత్ర ఈనెల 8న తిరుపతిలో జగనన్న ముగింపు సభను జయప్రదం చేద్దామని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ,సహాయ కార్యదర్శి మల్లికార్జున సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఏపీ కి
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలుచేయకుండా రాష్ట్రంను నష్టాలు ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా అప్పులు ఊబిలోకి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకెళ్తుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏది అనిచెప్పడానికి కూడా అవకాశం లేని పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2014, 2019 ఎన్నికల లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి దేశ విచ్చన్నకర విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో మోడీని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం తో భారత దేశము ,ఆంధ్ర ప్రదేశ్ ను కాపాడుకోవచ్చని సిపిఐ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ బస్సుయాత్ర నిర్వహించిందని తెలిపారు. బస్సు యాత్రకు 26 జిల్లాల ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారని ఆయన పేర్కొన్నారు. బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 8 శుక్రవారం తిరుపతిలో జరగనున్న బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ,జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ, సిపిఐ ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ , కార్యదర్శి శ్రీకాంత్ ,రూరల్ మండల కార్యదర్శి రమేష్ , సహాయ కార్యదర్శి నరేష్, మండల కార్యదర్శి రవీంద్ర, రైతు సంఘం నాయకులు వెంకటనారాయణ , ఆత్మకూరు మండల కార్యదర్శి రామకృష్ణ , శివ శాఖా కార్యదర్శులు నరసింహులుగోవింద, నాయక్. సుబ్బరాయుడు. పాండు. అప్పి రెడ్డి. గోవిందు. యుగేందర్ రెడ్డి. అక్కులన్న.నరసింహులు,వేణు.జిపి ఓబులేష్.అజయ్ కుమార్,మహేష్,రవి.రా మాంజనేయులు పాల్గొన్నారు.