Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

చలో కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి

విశాలాంధ్ర-తాడిపత్రి : ఈనెల 7వ తేదీన చలో కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని సిఐటియు పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారము విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఉద్యోగం నిర్వహిస్తూ మృతి చెందిన కార్మికుల వారసులకు ఉద్యోగం కల్పించాలని, కార్మికులకు పంపిణీ చేయాల్సిన రక్షక కవచాలైన బూట్లు, చేతులకు గ్లౌజులు, సబ్బులు తదితర మున్సిపల్ కార్మికుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరడమైనది. ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కార్య దర్శి జుబేర్, ఓబయ్య, జిపి. ప్రసాద్ పారిశుద్ధ విభాగం కార్మికులు వనూరప్ప, నరసింహమూర్తి, హరికృష్ణ మహబూబ్ బాషా, శ్రీరాములు,శంకర్, సాయి కృష్ణ, నారాయణ, రాముడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img