Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుదాం

పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ – సురేష్ బాబు

విశాలాంధ్ర -ఉరవకొండ : ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతి ఒక్కరు కూడా నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కూడా ఉందని ఉరవకొండ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ వై.సురేష్ బాబు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని అందించేందుకుగాను విరివిగా చెట్లు పెంచి సంరక్షించాలని ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించాలని, మొబైల్ ఫోన్ రేడియేషన్ తగ్గించాలని భూసారాన్ని పెంచేందుకు పంటల మార్పిడి చేయాలని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి నిల్వలు పెంచాలని కాలం చెల్లిన వాహనాలను నిషేధించాలని తదితర అనేక అంశాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎస్ డి సి, డీఎస్ డివో, ఏ డి ఎస్ సి, అధికారులు అనిల్ ఆనంద్ రాజ్ కుమార్, జగన్, రఘు విజయ్ పండిట్, జయలక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేష్ నాయక్ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img