Sunday, December 3, 2023
Sunday, December 3, 2023

అందరూ సమిష్టిగా కలిసి పనిచేస్తేనే తగిన ఫలితం చేద్దాం

జనసేన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిపిస్తాం: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

విశాలాంధ్ర- అనంతపురం : వచ్చే సార్వత్రికి ఎన్నికల్లో అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే తగిన ఫలితం ఉంటుందని, అనంతలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని.. త్యాగానికి సిద్ధంగా ఉంటానని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం అనంతపురం అర్బన్ టిడిపి విస్తృత సమావేశాన్ని నిర్వహించగా పార్టీ పరిశీలకులు రమణారెడ్డి హాజరయ్యారు. కల్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వి. ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ అనంత ఎమ్మెల్యే అభ్యర్థి సీటు విషయంపై చంద్రబాబు, నేను తేల్చుకుంటామని, పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటే తన భుజస్కందాలపై వేసుకుని గెలిపిస్తానన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గెలిపించడానికి తన వంతు కృషి చేస్తానని, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పెద్ద మెజారిటీతో గెలుస్తారన్నారు. అందరూ సమిష్టిగా కలిసి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని చంద్రబాబును మళ్ళీ సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తలు త్యాగాలకు సిద్ధం కావాలని..రుద్రంపేట పంచాయతీని ఆదర్శంగా తీసుకోవాలని పార్టీ కేడర్ కు సూచించారు. ఎప్పుడూ బయటకు రాని నారా భువనేశ్వరి ప్రజల్లోకి వస్తున్నారని, చాలామంది వైసిపి వాళ్ళు పార్టీలోకి వస్తామంటున్నారని వారిని సరైన సమయంలో పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. నగరంలోని కార్పొరేషన్ లో అవినీతి పెరిగిపోయిందన్నారు. సమస్యలపై పరిజ్ఞానం పెంచుకోవాలని పార్టీ కేడర్ కు సూచించారు. పార్టీ పరిశీలకులు రమణారెడ్డి మాట్లాడుతూ
ఎన్నికలకు 160 రోజులు మాత్రమే సమయం ఉందని, అంతా కష్టపడి పని చేయాలని పార్టీలో పని చేసే వరకే గుర్తింపు లభిస్తుందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బెయిల్ రాకుండా చూస్తున్నారని, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడిన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వైసిపి పని అయిపోయిందని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఈ ఆరు నెలలు కష్టపడి పార్టీ కోసం పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో నగరాధ్యక్షులు మారుతి కుమార్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు దేవల్ల మురళి, తలారి ఆదినారాయణ, బుల్లె శివ బాల, గాజుల ఆదెన్న, క్లస్టర్ ఇంచార్జిలు డిష్ నాగరాజు, సరిపూటి రమణ, వన్నూరు, మార్కెట్ మహేష్, ముక్తియార్, గుర్రం నాగభూషణ, గోపాల్ గౌడ్, దలవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న, కుంచపు వెంకటేష్, పోతుల లక్ష్మీనరసింహులు, వంక దారి వెంకటకృష్ణ, సుభాష్ చంద్రబోస్, ఈటే స్వామి దాస్, రంగాచారి, సాకే వెంకటేష్, మనోహర్, తెలుగు మహిళలు స్వప్న, సంఘ తేజస్విని, యూనిట్ ఇన్చార్జిలు, మాజీ కార్పొరేటర్లు,బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img