విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజక వర్గంలో రోడ్లు,భవనాలు విశ్రాంతి భవన్ లో బుధవారం యం.ఆర్. పి.యస్ పెద్దన్న అద్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా
యం.అర్.పి.యస్.జాతీయ అధ్యక్షులు డా.మున్నంగి నాగరాజుమాదిగమాట్లాడుతూ
మాదిగ-మాదిగ ఉప కులాల ఎస్సీ ఏ.బి.సి.డి.వర్గీకరణపై అన్ని పార్టీలు మాట తప్పాయని వర్గీకరణకు కట్టుబడి ఉన్న మహాజన సోషలిస్టు పార్టీకే మాదిగలు ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ అన్నారు.వర్గీకరణకు సహకరించని పార్టీల జెండాలు మాదిగలు మోయవద్దని అలాగే 2024 ఎన్నికల్లో ఆయా పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ పై రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధనకు జూలై మూడో వారంలో 20 లక్షల మంది ప్రజలతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
27/6/2023 కర్నూలు నుండి ప్రారంభమైన చలో హైదరాబాద్ సన్నాహక సమావేశాలు 95 నియోజకవర్గాల్లో కొనసాగిస్తూ గుంటూరు వరకు పర్యటన ఉంటుందన్నారు.ఈకార్యక్రమంలోయం.యస్.పి, యం.అర్.పి.యస్ అనంతపురం ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త కేబీ మధు మాదిగ . శ్రీ సత్య సాయి జిల్లా సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దన్న, రామాంజి నేయులు, వీరాంజినే యులు, .రాము,నారాయణ, ఎం ఈ ఎఫ్ నాగరాజు,పోతులయ్య,శ్రీనివాసులు,గోవిందు,శివశంకర్,గణేష్, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు