Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

చలో విజయవాడ జయప్రదం చేయండి

ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షులు శ్రీరాములు

విశాలాంధ్ర -ఉరవకొండ : ఏపీ ఎన్జీవో 21వ రాష్ట్ర మహాసభలుకు ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీఎన్జీవో ఉరవకొండ తాలూకా అధ్యక్షులు శ్రీరాములు మరియు సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఉరవకొండలో వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 తేదీలలో విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్నయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారన్నారు ఉద్యోగులు,ఉపాధ్యాయులు పింఛనర్ల సమస్యలను రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి హామీ పొందేలా కృషి చేస్తామని చెప్పారు. ప్రధానంగా సిపిఎస్ రద్దు, పెండింగ్ డీఎలు మంజూరు నూతన పేస్కేలు అమలు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జిపిఎస్ సరండర్ లీవ్, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు అమలు తదితర సమస్యలపై చర్చిస్తామన్నారు.ఈ సమావేశంలో పలు డిమాండ్లపై తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో తాలూకా కార్యదర్శి జగన్నాథ్, సంయుక్త కార్యదర్శి నాగభూషణం, ట్రెజరర్ శివయ్య, యూనియన్ నాయకులు ఎస్ టి ఓ నాగేంద్రబాబు,నిమ్మల వెంకటేశులు, మోతిలాల్ నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img