Friday, April 19, 2024
Friday, April 19, 2024

వ్యతిరేక విధానాలను అడ్డుకుందాం ఉక్కు పరిశ్రమను కాపాడుదాం

సిపిఐ ఎఐటియుసి

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్ : బిజెపి అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకుందామని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుదామని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం సిపిఐ వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ధర్నా పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు 32 మంది బలిదానం, 26,000 మంది రైతు త్యాగాలతో, 67 మంది శాసనసభ్యులు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు రాజీనామాతో ఆంధ్ర హక్కు అయిన విశాఖ ఉక్కును సాధించుకుంటే బిజెపి ప్రభుత్వం ప్రవేటికలను చేయడం సమంజసమా అని, 700 రోజులుగా విశాఖలో నిరసన దీక్షలకు మద్దతుగా సిపిఐ ఏఐటిసి ఎల్లవేళలా ఉంటుందని అందులో భాగంగానే విడతల వారీగా ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు హెచ్చరించారు. విశాఖలో ప్రజలకు మద్దతు తెలుపుతూ ఢిల్లీలో మోడీ సంక నాకు ఉన్నది జగన్ రెడ్డి కాదన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్షల శాఖలను ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది వాస్తవం కాదా అని బిజెపికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అధికారంలో వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న జీవోలతో బిజెపి పార్టీ అవలంబిస్తున్న విధానాలకు ప్రతి ఒక్కరు పాటుపడితే రాష్ట్రం బాగుంటుందని ఈనెల 23న జరిగే ఆర్డీవో కార్యాలయంలో తలపెట్టిన కార్యక్రమానికి కార్మికులు సిపిఐ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఓంకార్, బుడెన్, లక్ష్మీదేవమ్మ , వీరితోపాటు సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img