Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

పవన్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం

పవన్ సిద్ధాంతాలకు అనుగుణంగా నడక సాగిద్దాం
కొట్టి కుమార్ ఆధ్వర్యంలో గుమ్మం వద్దకే జనసేన కార్యక్రమం

విశాలాంధ్ర -తనకల్లు : పవన్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా చేపట్టిన గుమ్మం వద్దకే జనసేన కార్యక్రమాన్ని కొట్టి కుమార్ ఆధ్వర్యంలో జంబులింగేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి నియోజకవర్గంలోని జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు గుమ్మం వద్దకే జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు గుమ్మం గుమ్మం తిరుగుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోశీదని ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు విముక్తి పలకాలంటే 2024లో జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు ఈ పీడిత రాజకీయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లుతోందని అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనెదే జనసేన ఆశయమన్నారు మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు ఉచిత సిలిండర్లు రేషన్ కు బదులుగా 2500 నుండి 3500 వారి అకౌంట్లో జమ చేయడం బీసీలకు అవకాశాన్ని బట్టి ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించడం ఇవే కాక రైతులకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు జనసేన మేనిఫెస్టోలో ఉన్నాయని సమ సమాజ న్యాయం జనసేన తోనే సాధ్యమని 224 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేసుకోవడంలో ప్రజలందరూ సహకరించాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ బాలసముద్రం ఎంపీటీసీ అమర కార్తికేయ మండల కన్వీనర్ కె.వి రమణ ముని కుమార్ యోగానంద ఫయాజ్ రెడ్డి శ్రీనివాసులు నల్లచెరువు మండల కన్వీనర్ రవీంద్ర మేకల చెరువు చౌదరి మరియు జన సైనికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img