Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో పాఠకులకు, విద్యార్థులకు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఉపయోగపడుతున్నాయని ఎంపీడీఓ సాల్మన్ తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను గురువారం స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ తరగతి గదిలో ఆ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను చదవడం వల్ల పుస్తకంలోని సారాంశం మాత్రమే తెలుస్తుందని, వివిధ దిన, వార, పక్ష, మాసపత్రికలను చదవడం ప్రపంచ జ్ఞానం అవలోకనం అవుతుందన్నారు. అదేవిధంగా వివిధ దేశాల చరిత్రలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్రల పుస్తకాలు కూడా ఉంటాయన్నారు. విద్యార్థి దశ నుంచే గ్రంధాలయాలకు వెళ్లి చదవడం వల్ల జ్ఞాన సమూపార్జన ఒనగూరుతుందన్నారు. గ్రంథాలయ అధికారి వీరనారాయణరెడ్డి మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 14న గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు, బాలల దినోత్సవం, 15న గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, మాదక ద్రవ్యాలపై అవగాహన, పుస్తక పఠన ప్రాముఖ్యత, 16న గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు రంగనాథన్, పాతూరి నాగభూషణం, వెంకటరమణయ్య మొదలైన వారిని స్మరించుట, 17న కవి సమ్మేళనాలు, సెమినార్లు, రచయితల సందేశాలు, 18న పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు గ్రంథాలయాలపై చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, క్రీడా పోటీలు,19న దిశా చట్టం, మహిళా సాధికారతపై చర్చ, 20న డిజిటల్ గ్రంథాలయాలపై విద్యార్థులకు అవగాహన, గ్రంథాలయాల వారోత్సవాల ముగింపు వేడుకలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సాకే తిరుపాలు, రిటైర్డ్ ఉద్యోగులు బుల్లె నాగన్న, ఆదినారాయణ, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ వారోత్సవ పోస్టర్లను విడుదల చేస్తున్న ఎంపీడీఓ సాల్మన్ లైబ్రేరియన్ వీరనారాయణరెడ్డి, పాఠకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img