Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఆధార్ కు ఓటరు గుర్తింపుకార్డు అనుసంధానం

జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

విశాలాంధ్ర – శ్రీకాకుళం : జిల్లాలో తమ ఆధార్ కార్డుకు ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానం చేసుకోలేని వారందరూ తప్పనిసరిగా ఫారం -6బి ద్వారా అనుసంధానం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంబంధిత ఈ.ఆర్.ఓలు, ఏ.ఇ.ఆర్.ఓలు, బి.ఎల్.ఓలతో కలెక్టర్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఓటరు స్పచ్చంధంగా తన ఆధారు కార్డుకు ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు గతంలో పిలుపునివ్వడం జరిగిందని గుర్తుచేసారు. అయితే కొందరు మాత్రమే స్పచ్చంధంగా ముందుకువచ్చి తమ ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్ కు అనుసంధానం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన ఓటర్లు కూడా తప్పనిసరిగా తన ఆధార్ కార్డుకు ఓటరు ఐడిని లింక్ చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేసారు. ఇందుకు సంబంధించి వారి పరిధిలో గల బి.ఎల్.ఓల దగ్గరకు వెళ్లి ఫారం 6బి ద్వారా వారి ఆధార్ కు ఓటర్ ఐడిని లింక్ చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img