Friday, June 9, 2023
Friday, June 9, 2023

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే లోకేష్ పాదయాత్ర

విశాలాంధ్ర – పెద్దకడబూరు : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే యువగళం పేరుతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఫాం హౌస్ నందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి, నరవ రమాకాంతరెడ్డి లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తిక్కారెడ్డి, నరవ రమాకాంతరెడ్డి మాట్లాడుతూ మండలంలో ఈ నెల 24న గవిగట్టు, బాపులదొడ్డి, పీకలబెట్ట గ్రామాల మీదుగా జరిగే లోకేష్ పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, నాయకులు మధుసూదన్ రెడ్డి, మల్లికార్జున, ఆంజనేయ, వీరేష్ గౌడ్, నరసన్న, నాగప్ప, మల్దకల్, ముక్కన్న, వెంకట రెడ్డి, మునెప్ప, సత్యగౌడ్, రంగన్న, ఈరన్న, పెద్దయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img