Friday, April 19, 2024
Friday, April 19, 2024

పాదయాత్రలో కియా వద్ద సెల్ఫీ దిగిన యువ నాయకుడు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం గురువారం నాటికి 52వ రోజు 700 కిలోమీటర్లు పూర్తి అయినందున గురువారం ఉదయం విడది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై కియా పరిశ్రమ ఎదురుగా యువ నాయకుడు నారా లోకేష్ మొక్కను నాటి సెల్ఫీలు దిగారు కియా పరిశ్రమ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొరియన్స్ తో మాట్లాడి పరిశ్రమ ఏర్పాటుకు ఎంత కృషి చేస్తారని శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి మరియు కార్లు మార్కెట్ రంగంలోకి విడుదలైనప్పుడు ఇక్కడికి చంద్రబాబు నాయుడు వచ్చి కార్ల పరిశ్రమ యజమానులతో దిగిన ఫోటోలను చూసి అలాగే కరువు సీమలో కార్లు తయారు పరిశ్రమ ఎలా ఉంటుంది కారణం తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు ఆనాటి ప్రభుత్వము ఎంతో గొప్పగా ఆలోచించి కరువు ప్రాంతాన్ని ప్రారంభించడానికి నీటి రంగాన్ని అభివృద్ధి పరిచారని అదేవిధంగా కరువు సీమలో ఇటువంటి పరిశ్రమలు రావడం సంతోషదగ్గ విషయమని అలాగే ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కలిగాయని ఇక్కడ ప్రాంతం యొక్క రూపురేఖలే మారినాయని పరిశ్రమలు రావడం వలన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఇటువంటి పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారని ప్రభుత్వము ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్న ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని పరిశ్రమలకు ఏర్పాటు కావలసిన మౌలిక వసతులు కల్పించడానికి కూడా సరైనటువంటి అవగాహన లేదని ఆయన తెలిపారు పాదయాత్రలో గుట్టురు గ్రామం నందు 52వ రోజు 700 కిలోమీటర్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అలాగే ఈ శిలాఫలకం నందు పెనుకొండ నియోజకవర్గం మడకశిర నియోజకవర్గం హంద్రీనీవా కాలువ వలన ఎన్నో గ్రామాలకు నీటి సౌకర్యము కల్పించినందున పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఒక అవగాహన కార్యక్రమంలో ఉంటుందని అలాగే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి గుర్తుగా ఉంటుందని ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి మరియు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బి టి నాయుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సవితమ్మ నిమ్మల కిష్టప్ప స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img