విశాలాంధ్ర – వలేటివారిపాలెం. మండలంలోని చుండి గ్రామంలో చుండి సర్పంచ్ ఇరుపని సతీష్ ఆధ్వర్యంలో మహానేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా సర్పంచ్ సతీష్ మాట్లాడుతూ జల యజ్ఞ ప్రదాత, పేదల పెన్నిధి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఏకంగా పథకాలే రూపొందించి అనునిత్యం ప్రజల శ్రేయస్సు గురించే తపించిన రాజన్న, జనం మదిలో ప్రజల మనిషిగా నిలిచారని అన్నారు ఆ తండ్రి వారసత్వంగా రాజన్న బిడ్డ మన జగనన్న ఆయన బాటలోనే పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు తానున్నానంటూ ఆ రాజన్నపాలననే కొనసాగిస్తున్నారని అన్నారు. 74వ జయంతి సందర్బంగా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను స్మరిస్తూ చుండి బస్టాండ్ లో ఉన్న దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ ఇరుపని అంజయ్య, గృహసారధులు ఇరుపని లక్ష్మీనరసింహం గ్రామ వైయస్సార్ నాయకులు నల్లబోతుల వెంకట్రావు, గౌరవరపు నాగేంద్ర బాబు,కండె ప్రసాదు,పూలిగుంట రాజేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.