Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు

విశాలాంధ్ర- పెనుకొండ : జల యజ్ఞ ప్రదాత, పేదల పెన్నిధి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని..వాటి పరిష్కారం కోసం ఏకంగా పథకాలే రూపొందించి.అనునిత్యం ప్రజల శ్రేయస్సు గురించే తపించిన రాజన్న, జనం మదిలో ప్రజల మనిషిగా నిలిచారు. ఆ తండ్రి వారసత్వంగా రాజన్న బిడ్డ మన జగనన్న ఆయన బాటలోనే పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు తానున్నానంటూ ఆ రాజన్నపాలననే కొనసాగిస్తున్నార 74వ జయంతి సందర్బంగా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను స్మరిస్తూ పెనుకొండ కేంద్రంలోని మడకశిర రోడ్, వైఎస్సార్ సర్కిల్ నందు ఉన్న దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం కేక్ కట్ చేసిన పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, అభిమానులు తదితరులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img