గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల గ్రంథాలయంలో ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు ఏడు రోజులు పాటు 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని, జూనియర్ విభాగంలో 6, 7వ తరగతులు, సీనియర్ విభాగంలో 8, 9, 10 తరగతి తరగతులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలు యందు పాల్గొని విద్యార్థులు ఈనెల 13వ తేదీ సాయంత్రం లోగా సమాచారాన్ని మాకు పంపాలని తెలిపారు. ప్రతి అంశము ప్రతి తరగతి నందు ఇద్దరిని మాత్రమే ఎంపిక చేసి ప్రతి స్కూల్ నుండి పది మందిని మాత్రమే పంపాలని ఆయా పాఠశాలల హెచ్ఎం లకు వారు సూచించారు. ఈనెల 14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రముఖులు, 17న కవి సమ్మేళనం, 18న చిత్రలేఖనం క్విజ్, 19న దిశా చట్టం, మహిళా సాధికారత పై చర్చ, 20న డిజిటల్ గ్రంథాలయం పై విద్యార్థులకు అవగాహన. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు ఉంటాయని తెలిపారు. కావున విద్యార్థులు, పాఠకులు, యువతి, యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.