Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

కదిరిలో జరుగు రైతు సంఘాల సదస్సును జయప్రదం చేయండి…

ఏపీ రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు జేవి రమణ, పెద్దన్న
విశాలాంధ్ర- ధర్మవరం : కదిరిలో బుధవారము నిర్వహించబడే సంయుక్త రైతు సంఘాల ఆధ్వర్యంలో గల సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘాల జిల్లా అధ్యక్షులు పెద్దన్న జిల్లా ప్రధాన కార్యదర్శి జేవి రమణ, ధర్మవరం మండల కార్యదర్శి మారుతీ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగానే ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. అకాల వర్షాల వలన రైతులు నష్టపోయిన పంటలకు పంట నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, కల్తీ విత్తనాలకు నష్టపోయిన రైతులకు కూడా నష్టపరారని పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని పంటలకు వాతావరణ బీమా ను వర్తింపజేయాలని, ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించాలని, రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్ బిగించ రాదని తెలిపారు. పట్టు రైతులకు పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పదివేల పదివేల రూపాయల సాగు సాయం అందించాలని తెలిపారు. కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకురావాలని, ఉపాధి హామీ పథకాన్ని రైతు వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, పార్లమెంటులో గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలన్న తదితర విషయాలతో రైతుల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, శ్రీరాములు, రేగాటిపల్లి రవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img