Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

శిక్షణ తరగతులను జయప్రదం చేయండి.. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య

విశాలాంధ్ర -ధర్మవరం : ఏఐఎస్ఎఫ్ (అఖిల భారత విద్యార్థి సమైక్య) ఆధ్వర్యంలో జులై 3, 4, 5వ తేదీలలో మంత్రాలయంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న రాయలసీమ విద్యా, వైజ్ఞానిక, రాజకీయ, సైధాంతిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకై ప్రతి విద్యార్థి ఉద్యమించాలని, రాష్ట్ర విభజన చట్టంలో 11 జాతీయ విద్యా సంస్థలను ప్రారంభించిన నిధులు కేటాయించకపోవడం వలన మొండి గోడలకే పరిమితమయ్యాయి అని వారు మండిపడ్డారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసి వేలాది పాఠశాలలను మూసివేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలకు పోవడానికి రవాణా సౌకర్యాలు లేక, డ్రాప్స్ ట్స్ సంఖ్య మరింతగా పెరుగుతోందని, నూతన ఆవిష్కరణలకు కేంద్రమైన యూనివర్సిటీలలో ప్రొఫెసర్స్ లేక విద్యా ప్రమాణాలు మరుగున పడుతున్నాయని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మేస్, కాస్మోటిక్ చార్జీలు పెంచకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడటం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. విద్యారంగ సమస్యలపై, పలు విషయాలను ఈ శిక్షణా తరగతులలో చర్చించి, పరిష్కారానికై తగిన మార్గ దర్శకాలు, ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు జయవర్ధన్, యాసీన్, మురళీ చరణ్, గణేష్ ,మహేష్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img