జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష పై, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఈనెల 24వ తేదీన ధర్మవరం నుండి తిరుమల వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని ఈ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని వారు తెలిపారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రావాలన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఈ విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ధర్మారం నుండి తిరుమలకు కాలినడకతో వెళుతున్నట్లు వారు తెలిపారు. ఈ పాదయాత్ర తొలుత పట్టణంలోని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని వారు తెలిపారు. కావున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ అనుబంధ సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.