పదవ వార్డ్ ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్
విశాలాంధ్ర – ధర్మవరం : ఏప్రిల్ 1వ తేదీన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రను ధర్మవరం నియోజకవర్గంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఆ పాదయాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పదవ వార్డ్ ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పలు వార్డుల్లో వారు పర్యటిస్తూ కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. తప్పక అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో పాటు హాజరై విజయవంతం చేయుటకు తమ సహాయ సహకారాలను అందించాలని వారు కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయకపోవడంతో ప్రజలందరూ కూడా విసిగిపోయారని, టిడిపి పార్టీకి మద్దతు పలుకుతూ అనేక పోరాటాల్లో కూడా పాల్గొనడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఎల్లప్పుడూ కూడా పోరాడుతారని, ఇందుకు టిడిపి అనునిత్యం అండదండలుగా ఉంటూ కార్యకర్తలను ప్రజలను కాపాడుకుంటుందని వారు తెలియజేశారు.