విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : విద్యార్థులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపుతూ..విద్యార్థుల కలల స్వప్నాన్ని నెరవేరుస్తుంది ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి పాళ్యం నారాయణ స్వామి పేర్కొన్నారు. శనివారం 88వ ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వర్షిత గృహంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వైఖరితో విద్యార్థుల భవితను ప్రశ్నార్థకంగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కుల్లాయి స్వామి, కార్యదర్శి చిరంజీవులు, మాజీ జిల్లా అధ్యక్షుడు తులసి రామ్, నగర కార్యదర్శి రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమామహేష్ , నగర సహాయ కార్యదర్శి వంశి పాల్గొన్నారు.