విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గం లోని ముదిగుబ్బ మండలం సిరి గారి పల్లి గ్రామానికి చెందిన తిరుపాలు (55) గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటూ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో గురువారం ముదిగుబ్బ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మవరం జిఆర్పి పోలీసులు తెలిపారు. మృతుడు అరటికాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య పిల్లలు ఎవరూ లేరు. తదుపరి ధర్మారం జి ఆర్ పి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.