ఉమ్మడి జిల్లాలోనే ఇది తొలి మరణం.
ఈ వ్యాధిపై వివరాలు సేకరిస్తున్న పుట్టపర్తి ఆరోగ్యశాఖ అధికారులు
విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని పోతుకుంట గ్రామములో గురువారం మధ్యాహ్నం స్క్రబ్ టైపస్ అనే వ్యాధితో జి మధు (20) మృతి చెందాడు. వివరాలకు వెళితే మృతుడు మధు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు వచ్చిన అనారోగ్యాన్ని తొలిసారిగా పట్టణంలోని స్పందన హాస్పిటల్ లో గత నెల 28వ తేదీన అడ్మిషన్ అయినాడు. అక్కడి వైద్యులు పరీక్షించిన అనంతరం అనంతపురం పావని హాస్పిటల్ కు రెఫర్ చేశారు. ఆ హాస్పిటల్లో గత నెల 29 అండ్ 30వ తేదీ అనగా రెండు రోజులు పాటు వైద్య చికిత్సలను పొందాడు. తదుపరి అక్కడి రైతులు బెంగళూరు ఎస్టీ జాన్స్ హాస్పిటల్ కు రెఫర్ చేశారు. అక్కడ గత నెల 31వ తేదీ వరకు వైద్య చికిత్సలను పొందారు. తదుపరి తన స్వగ్రామం పోతుకుంటకు చేరుకొనగా, ఈనెల 14వ తేదీ గురువారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మృతి చెందాడని ఆరోగ్య అధికారులు తెలిపారు. మృతుడు పాలిటెక్నిక్ వరకు చదువుకున్నాడని అనంతరం పెనుకొండలో గల కియా పరిశ్రమలో ఉద్యోగం చేసేవాడని మేనమామ శివయ్య తెలిపారు. శివయ్య మాట్లాడుతూ మా గ్రామంలో దోమల బెడద అధికంగా ఉందని, కరెంటు కోతలు ఎక్కువ కావడంతో చంటి పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆరోగ్య అధికారులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే తొలి స్క్రబ్ టై పస్ అనే వ్యాధితో మొదటి మరణంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. దీంతో ధర్మవరం మండలంలోని ఆరోగ్య శాఖకు చెందిన వారందరూ కూడా అప్రమత్తమయ్యారు.