Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

దాతల సహకారంతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహణ.. తారక్ చేయూత ట్రస్ట్ అంజి

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, రోడ్డు పక్కన గల వాళ్లందరికీ, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పట్టణంలోని వివిధ అనాధ ఆశ్రమముల వారికి కూడా దాతల సహాయ, సహకారాలతో ప్రతిరోజు రెండు పూటలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తారక్ చేయుట ట్రస్ట్ సభ్యులు అంజి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ కీర్తిశేషులు ఎర్రజోడు శ్రీనివాసులు వర్ధంతి సందర్భంగా మూడు రోజులపాటు భార్య లక్ష్మీదేవి కుమారులు లోకేష్ చంద్రశేఖర్లు తమ దాతృత్వమును చాటుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు ప్రతిరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నము, రాత్రి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతో శీదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతృప్తిని కలిగించిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తారక్ చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగానే సోమవారము నాడు రాజేంద్రనగర్ లోని అనాధాశ్రమం, గొట్లూరు లోని అనాధశ్రమం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, దేవాలయాలు, మసీదులు, చర్చల వద్ద గల బిక్షగాలకు, రోడ్డు వైపున ఉన్న అనాధలకు భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మూడు రోజులకు దాతలుగా వ్యవహరించిన ఎర్రజోడు కుటుంబ సభ్యులందరికీ కూడా అంజి తో పాటు సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఆకలిగొన్న వాడికి అన్నం పెడితే ఆ సంతోషమే వేరేగా ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాలు దైవ సేవతో సమానమని వారు తెలిపారు. అన్నదాన కార్యక్రమములో దాతలుగా ఆసక్తి గలవారు సెల్ నెంబర్ 99 85242322 సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు రమేష్, ముత్యాలు, తుకారాం, నవ కుమార్, వెంకీ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img