Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన మండల అధికారులు

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ను సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం నందు నూతనంగా పెనుకొండ మండలానికి విచ్చేసిన మండల విద్యాధికారిగా చంద్రశేఖర్ మండల విద్యాధికారిగా సుధాకర్ 2 మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే శంకర్ నారాయణను కలిసి ఆయనకు పూలమాల సమర్పించి పరిచయాన్ని ఏర్పరచుకుని విధులు గురించి తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని ఉన్న ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని జివిడి కిట్స్ సకాలంలో పంపిణీ పూర్తి చేయాలని నాడు నేడు పనులు పూర్తి చేయుటకు కృషి చేయాలని ఆయన తెలిపారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాలచార్యులు, వెంకట శ్రీనివాసులు, ప్రభాకర్, నాగేంద్ర, రమేష్, బసి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img