Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి

విశాలాంధ్ర- జేఎన్టీయూఏ:మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన కు బాధ్యుడిగా సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుళాయి స్వామి, ఏఐవైఏఎఫ్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్, జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. మణిపూర్ ఘటనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపు వైఖరిపై సోమవారం అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద మహిళలతో మానవహారం నిర్వహించి నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మానవీతను మరిచే.. రాజ్యాంగ హక్కులను హరించి వేస్తున్నారని అన్నారు. నేరస్తులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శులు మోహన్ కృష్ణ, ధనంజయ, జిల్లా నాయకులు దేవా చాంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతమ్మ, లింగమయ్య, బంగారు బాషా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img