Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మరమగాలకు మే ఒకటవ తేదీ చివరి గడువు

ఎమ్మెల్యే, కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడి

తదుపరి మే 5 నుండి ప్రత్యక్ష పొరాటమే : చేనేత కార్మిక సంగం

విశాలాంధ్ర – ధర్మవరం : మరమగ్గాలకు మే ఒకటో తేదీ వరకు గడువు ఇవ్వడం జరుగుతుందని తదుపరి ఐదవ తేదీ నుండి ప్రత్యక్ష పోరాటానికి సంయుద్ధం అవుతామని చేనేత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జింక చలపతి, చేనేత కార్మిక సంఘం పట్టణ,అధ్యక్ష కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ
చేనేత కార్మికుల దారేంటి?. మా ఉపాది మాటేంటి? మా భవిష్యత్తు ఏమిటి? అన్న నినాదంతో దశలవారి ఉద్యమం లో భాగంగా ఇటీవల చేపట్టిన ఏప్రిల్ నెల 3వ 4 వ తేదీలలొ 36 గంటల దీక్ష విజయవంతమైనట్లు వారు తెలిపారు. దీక్షకు సహకరించిన వారికి స్వచ్చందంగా, దీక్షలొ పాల్గొన్న చేనేత కార్మికులకు కృతజ్ణతలు తెలిపారు.
రెండవ దశ ఉద్యమం లొ భాగంగా ప్రక్ష్యక్ష పొరాటానికి పిలిపు నిస్తున్నామని, అందులొ భాగంగా మరమగ్గాలలో ఇప్పటి వరకు అసంపూర్థి గా ఉన్న, కొదవ వార్పులను మే ఒకటొ తేదీ లొపు పూర్థి చేసుకోవాలని మరమగ్గాల యజమానులకు తెలియజేయడం జరుగుతోందన్నారు. తరువాత మే ఐదవ తేదీ నుండి ఎక్కడ వైలేషన్ చేసినా, సదరు మగ్గాల వార్పులను చేనేత కార్మికులు తెగ్గోస్తారని హెచ్చరించారు. ఆధికార్లు ఈ లోపు ఈ వైలెషన్ను అరికడితే, కార్మికులకు చాకులకు పని తప్పుతుందని అన్నారు. ఐతే ఈ లొపు అధికార్లపై వత్తిడి తీసుకు రావడానికి కలెక్టరేట్ ముట్టడి లేక ధర్మవరం బంద్ అంశాలను కూడా పరిసీలిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు ఆదినారాయణ, శ్రీధర్, మల్లికార్జున, మంజునాథ్, నారాయణస్వామి, మోహన పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img