విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న మౌనిక యమునా వసతి గృహంలో బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వసతి గృహ సిబ్బంది, విద్యార్థుల సహకారంతో అంబులెన్స్ లో చికిత్స నిమిత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.