Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మెడికల్ కాలేజీ ఫ్రెషర్స్ డే అదరహో….

. డాన్సులతో ఆడిటోరియం హోరెత్తించిన మెడికోలు
. వైద్య విద్య ద్వారా ప్రజలకు సేవ చేయండి
. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : నూతన వైద్య విద్యార్థులు 2కె 22 బ్యాచ్ మెడికోలకు 2కె 20 బ్యాచ్ వైద్య విద్యార్థులు అపూర్వ స్వాగతాన్ని పలుకుతూ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, విశిష్ట అతిథులుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ రఘునందన్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ వైద్యో నారాయణ హరి: అన్న నానుడిని నిజం చేస్తూ వైద్య విద్యను ఎంతో భక్తిశ్రద్ధలతో చదువుకుని, ఉన్నత విద్యావంతులుగా, సంస్కారవంతమైన విలువలతో కూడిన వైద్య వృత్తిని చేపట్టినప్పుడే మీ వలన ప్రజలకు మేలు కలుగుతుందని, సమాజానికి సేవ చేసే మహాభాగ్యం డాక్టర్ గా మీకు ఆ దేవుడు ప్రసాదించారని దానిని సద్వినియోగపరుచుకుని ఉపాధ్యాయుల నాణ్యమైన వైద్య విద్య బోధనలో, సీనియర్ల సలహాలతో, ఉత్తమ జనాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ ఎన్ని కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదని, ఎన్ని లక్షల మందికి వైద్య వృత్తి ద్వారా జీవితాన్ని ప్రసాదించామన్నదే ముఖ్యమని తెలిపారు. వైద్య విద్యార్థిని విద్యార్థులకు ఐడెంటిటీ కార్డులను అతిధులు అందించారు. తర్వాత ఆటల పోటీలలో, ఫైన్ ఆర్ట్స్ పోటీలలో, ఫోటోగ్రఫీ పోటీలలో గెలుపొందిన వారికి మూడువందలకు పైగా బహుమతులను అతిధులు చేతుల మీదుగా మెడికోలు అందుకున్నారు. ఆ తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పరిణిత సాయి ప్రదర్శించిన మహిషాసుర మర్దిని కూచిపూడి నృత్యం అందరినీ అలరించింది. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ హర్ష శ్రీ విష్ణు చేసిన కూచిపూడి నృత్యం, చిత్రేష్ తన మిత్రులు ప్రదర్శించిన వయోలిన్ పాటలు ఎంతో సృజనాత్మకత తో ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాటకు అమ్మాయిలు అబ్బాయిలు ప్రదర్శించిన నృత్యంతో ఆడిటోరియం చప్పట్లు ఈలలతో దద్దరిల్లింది. 30 కి పైగా నృత్యాలు ను స్కిట్స్ ను అతిధులు ఆహ్లాదంతో వీక్షించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల డాక్టర్లు డాక్టర్ నవీన్ అహ్మద్, డాక్టర్ భీమసేన చారి, డాక్టర్ దుర్గ, డాక్టర్ సుహాసిని, డాక్టర్ శంకర్, డాక్టర్ శాంతిరెడ్డి, డాక్టర్ సరళ, డాక్టర్ భవాని, డాక్టర్ శైలజ, డాక్టర్ ఆశాలత, డాక్టర్ సరోజ, డాక్టర్ పద్మ శ్రావణి, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ నిహారిక, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ అబ్దుల్ మజీద్, డాక్టర్ శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, డాక్టర్ సహజీర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img