విశాలాంధ్ర -అనంతపురం ప్రవాస ఆంధ్రులైన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, స్నేహలత హాస్పిటల్స్ అనంతపురం. డాక్టర్ లారెన్స్ మోస్లీ, రోసెన్ బౌమెన్ గురువారం దాదాపు 26 లక్షలు విలువ చేయగల గుండె జబ్బులకు సంబంధించిన స్టంట్ లను అదే విధంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరికరములను అనంతపురం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కి విరాళంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అడిషనల్ డి.యం.యి. డాక్టర్ కె. ఎస్. ఎస్. వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్. ఎం. ఓ. డాక్టర్ వి. పద్మజా , ఆలంబన స్వచ్ఛంద సంస్థ జనార్దన్ , డాక్టర్. మనోరంజన్ రెడ్డి మరియు రేడియాలజీ ఆచార్యులు పాల్గొని దాతలకు ధన్యవాదములు తెలియజేశారు.