Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

నియోజకవర్గ పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణముపై సమావేశం..

ఆర్డీవో తిప్పే నాయక్
విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల యొక్క పునర్వ్యవశీకరణ అంశముపై ఆర్డిఓ తిప్పే నాయక్ రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఎమ్మార్వో యుగేశ్వరి దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ధర్మవరం మార్బల్ పరిధిలోని నెహ్రు నగర్ లో ఎంపీపీ స్కూల్ నందు నాలుగు పోలింగ్ స్టేషన్లో రెండింటిని(పోలింగ్ స్టేషన్ నెంబర్ 218,219) తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ని ఎన్జీవో హోం కు తదుపరి బీసీ హాల్కు మార్చాలని ప్రతిపాదించడం జరిగిందన్నారు. అదేవిధంగా రూరల్ పరిధిలో రావులచెరువు నందుగల పోలింగ్ కేంద్రం నెంబర్ 267ను పంచాయితీ కార్యాలయం నుండి జిల్లా పరిషత్తుకు తదుపరి తుంపర్తి నందు ఎంపీపీ స్కూల్ బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నందున ఆర్డిటి స్కూల్ నందుకు మార్చుటకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. అలాగే ముదుగుబ్బ మండలం దురుగల్లు నందు గల పోలీస్ స్టేషన్ నెంబర్ 59 ని గ్రామపంచాయతీ కార్యాలయం నుండి జడ్పీహెచ్ఎస్ స్కూలుకు మార్చడం జరిగిందని కొన్ని పోలింగ్ స్టేషనులకు నామినేట్ లేజర్ చేంజ్ చేసి కూడా ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలిపారు. 1400 కంటే ఎక్కువ ఓటర్లు గల పోలింగ్ స్టేషన్లకు కొత్త పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేయుటకు ప్రతిపాదించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల సమ్మతి మేరకు జిల్లా కలెక్టర్ వారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img