Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష పథకంపై సమావేశం

ఆర్డీవో తిప్పే నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు “వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్ష” పథకంలో అంతర్భాగంగా మూడవ దశనందు ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 23 గ్రామాలకు ఎంపిక చేయడం జరిగిందని, ఎంపిక చేయబడిన 23 గ్రామాలకు సంబంధించిన డివిజనల్ ఇన్స్పెక్టర్లు, తహసీల్దారులు, రీ సర్వే డిప్యూటీ తాసిల్దారులు, మండల సర్వేయర్లు, సంబంధిత గ్రామాల గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లు సమావేశమునకు సకాలములో హాజరుకావాలని ఆర్డిఓ తిప్పే నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి తప్పక అందరూ 10 నిమిషాల ముందు హాజరు కావాలని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించినటువంటి పలు విషయాలను తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img