విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : రాష్ట్ర కమిషనర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వీరబ్బాయి ఆదేశాల మేరకు జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రతి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం వారు సంక్రమిత,గుర్తింపు పొందిన వ్యాధుల గురించి జిల్లా కేంద్రానికి సమాచారం పంపించాలని తెలిపారు. సమాచారం పంపించే విధానంలో తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి డాక్టర్ వీరబ్బాయి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిల వారు వైద్య ఆరోగ్యశాఖ సూచించిన ఐ హెచ్ పి ఐ పోర్టల్ (జి ఒ ల్ ) లో ప్రతిరోజు ఈ సంక్రమిత, గుర్తింపు పొందిన వ్యాధుల సమాచారాన్ని తప్పకుండా పంపించాలని తెలిపారు. ఈ సమాచారం జిల్లా కేంద్రం నుండి రాష్ట్రస్థాయికి ప్రతిరోజు పంపవలసి ఉంటుంది అన్నారు. ఈ సమాచారం ప్రైవేట్ ఆసుపత్రుల వారు పంపడం వల్ల గ్రామస్థాయిలోనూ మరియు పట్టణ స్థాయిలోనూ వ్యాధుల గుర్తింపు మరియు తీవ్రతను అంచనా వేసి వ్యాప్తిని తగ్గించడం సులభతరం అవుతుందని వారు తెలిపారు. ఇదివరకు ఈ వ్యాధుల గుర్తింపు కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే జరిగేదని ఇప్పటినుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి వారు కూడా సమాచారం తప్పకుండా పంపాలని వారు తెలిపారు. దీనివల్ల వ్యాధుల గుర్తింపు మరియు చర్యలు చేపట్టడం సులభతరమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ గురించి ప్రైవేట్ ఆస్పత్రిలో వారికి తెలియజేయుటకు బుధవారం మొదటగా బేబీ హాస్పిటల్ ,వైఎస్ఆర్ హాస్పిటల్, సుదర్శన్ హాస్పిటల్, పావని హాస్పిటల్ లలో ఉన్న సిబ్బందికి ఈ పోర్టల్ లో సమాచారం పొందుపరిచే విషయంలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో త్యాగరాజు, ఎపిడమాలజిస్ట్- ఐ డి ఎస్ పి వేణుగోపాల్ యాదవ్ పాల్గొన్నారు.