Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మానసిక వికాసమే విద్యకు పరమార్థం

దాసరి వాసంతి సాహిత్య

విశాలాంధ్ర ధర్మవరం:: మానసిక వికాసమే విద్యకు పరమార్థమని డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ధర్మవరంలోని ఎన్కెసి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అనంతపురంలోని రాష్ట్రీయ సేవా సమితి (రాస్) మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వాసంతి సాహిత్య మాట్లాడుతూ ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణలు కాదని, కృషి పట్టుదలతో తమలోని లోపాన్ని, వైకల్యాన్ని అధిగమించినప్పుడే విజయం సాధిస్తుందని తెలిపారు. ఇలాంటి వారికి తగిన ప్రోత్సాహం తోడ్పాటు చేస్తే తప్పకుండా మంచి మార్పు రాగలదని తెలిపారు. లూయీ బ్రెయిలీ, స్టీఫెన్, హాకింగ్ వంటి మహనీయుల స్ఫూర్తితో జీవితములో ఎలాంటి సవాళ్లు ఎదురైనా, వాటిని దీటుగా ఎదుర్కొని విజయం సాధించాలన్నారు. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఎన్కేసి సేవాసమితి చేస్తున్న సేవా కార్యక్రమం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి వ్యవస్థాపకులు కమలనాథ్, జీవీ రమణ, కోటేశ్వరి దేవి, నవీన్, పాఠశాల నిర్వాహకులు రాజామణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img