Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

6 వ సెమిస్టర్ ఫలితాలలో సత్య కృప డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 6వ సెమిస్టర్ బీకాం ఫలితాలలో స్థానిక శ్రీ సత్య కృప ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్ధినిలు ప్రతిభ కనబరిచారని కళాశాల కరెస్పాండెంట్ డోలా పెద్దిరెడ్డి ప్రిన్సిపాల్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు కళాశాలలో విద్యార్ధినిలుకు స్వీట్లు పంచి ఆయన అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ విద్యార్ధినిలు డి. లక్ష్మీదేవి 86 శాతము, బి .పూజిత85 శాతము, డి .స్నేహ 85 శాతము, పి .లక్ష్మి 85 శాతము, పి .హేమ పుష్ప84 శాతము, టి. వందన 83 శాతము, యం.. ధనలక్ష్మి 82 శాతము, జి.. శ్రావణి 81 శాతము, అర్. రమ్యశ్రీ 81 శాతము, ఎస్.. యస్మిన్ 81 శాతము, యు .గాయత్రి 81 శాతము, బి బి ఏ. ఆరవ సెమిస్టర్ ఫలితాలలో డి .తరుణి సాయి 82 శాతము, బి. లక్ష్మి చిన్మయి 80 శాతము, టీఎం.మౌనిక 80 శాతము, యం .ప్రశాంతి 77 శాతము, ఏ .భావన 77 శాతముతో టౌన్ ఫస్ట్ సాధించింది అని తెలిపారు. కళాశాల ఉత్తీర్ణత శాతం 90 శాతముగా నమోదైనదని తెలిపారు. ఇంతటి మహత్తర విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అధ్యాపకబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల, ఏవో రంగారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు విద్యార్ధినిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img