విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 5వ సెమిస్టర్ బీకాం, బిబియే ఫలితాలలో స్థానిక శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు అసమాన ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నాడు కళాశాలలో విద్యార్థులకు స్వీట్లు పంచి ఆయన అభినందించారు. తమ విద్యార్థులు భార్గవి 84 శాతము, చంద్రకళ 83 శాతము, మెహబూబా 82 శాతము, హారిక 80 శాతము, నంద కుమార్ 80 శాతము, యమున 79 శాతము, చరణ్ సాయి 78 శాతము సాధించారని తెలిపారు.కళాశాల ఉత్తీర్ణత శాతం 83 శాతముగా నమోదైనదని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తొలిసారిగా ప్రవేశపెట్టిన డిగ్రీ ఇంటర్న్షిప్ ఫలితాల నందు తమ విద్యార్థులు 85 శాతము కి పైన 30 మందికి పైగా విద్యార్థులు సాధించారని తెలిపారు.ఇంతటి మహత్తర విజయాన్ని అందించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అధ్యాపకబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కరిముల్లా, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.