విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ పట్టణానికి చెందిన టిడిపి మైనార్టీ నాయకులు పామిడి నూర్ సోమవారం వైఎస్ఆర్సిపి పార్టీ జోనల్ విభాగం అధ్యక్షులు యువనేత ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వైసీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని యువనేత ప్రణయ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు బసవరాజు, పామిడి సలీం,జాకిర్, నిజాం తదితరులు పాల్గొన్నారు